• Login / Register
  • Canada crime News | కెనడాలో వాల్ మార్ట్ ఓవెన్ లో శవమై తేలిన భారతీయ యువతి

    హత్యగా అనుమానిస్తున్న ఫ్యామిలీ
    విచారిస్తున్న కెన‌డా పోలీసులు

    Hyderabad : భారత్ కు చెందిన 19 ఏళ్ల యువతి కెనడాలోని ఒక వాల్ మార్ట్ స్టోర్ లోని భారీ ఓవెన్ లో శవమై కనిపించింది. ఈ శ‌వాన్ని స్థానికులు గుర్తించారు. కెనడాలోని హాలిఫాక్స్ లోని వాల్ మార్ట్ ఓవెన్ లో ఆ 19 ఏళ్ల యువతి మృతదేహం బ‌య‌ట‌ప‌డింది. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. అనంత‌రం పోలీసుల స‌హాయంతో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ ఘటన గ‌త శ‌నివారం జరిగినప్పటి నుంచి ఆ వాల్ మార్ట్ దుకాణాన్ని మూసివేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరణానికి గల కారణాలు దర్యాప్తులో తేలుతాయని పోలీసులు తెలిపారు. అయితే ఈ దర్యాప్తు సంక్లిష్టమైనదని పోలీసు కానిస్టేబుల్ మార్టిన్ క్రోమ్వెల్ తెలిపారు. దర్యాప్తును త్వరగా ముగించడానికి ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ 19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్ కుటుంబం భారత్ లోని పంజాబ్ నుంచి ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లారు. గుర్ సిమ్రాన్ కౌర్ మృతదేహం ఆమె తల్లికి ఓవెన్ లోపల కనిపించింది. ఆ యువతి సాధారణంగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయదని, కానీ, ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ గా ఉందని ఆమె తల్లి పోలీసులకు తెలిపారు. 19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్ ను మరో వ్యక్తి ఆ భారీ ఓవెన్ లోపల ఉంచినట్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ ఓవెన్ ఆన్ లో ఉందని, డోర్ హ్యాండిల్ ఉందని, లోపలి నుంచి దాన్ని మూయడం, తెరవడం అసాధ్యమని వాల్ మార్ట్ ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు.
    *  *  * 

    Leave A Comment